
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చారిత్రాత్మక వికెట్ తీశాడు. తొలి ఓవర్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్‌తో ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ప్రపంచకప్‌లో ట్రెంట్ బౌల్ట్ ఆధిపత్యం కొనసాగుతోంది. బౌల్ట్ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 22 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 23.21 సగటుతో 41 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా 4.62 ఎకానమీ వద్ద పరుగులు ఇచ్చాడు. మొత్తం 19 మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒక్కసారి 5 వికెట్లు కూడా తీశాడు. బౌల్ట్ న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడుతాడు. ఇప్పటి వరకు 78 టెస్టులు, 106 వన్డేలు, 55 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 27.49 సగటుతో 317 వికెట్లు, వన్డేల్లో 23.85 సగటుతో 198 వికెట్లు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 22.25 సగటుతో 74 వికెట్లు తీశాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు 11వ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించగా.. బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పుడు ఇరు జట్లు మూడో మ్యాచ్ ను ఆడుతున్నాయి.