
India vs Pakistan Match Live Updates: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ.. దాన్నో మ్యాచ్‌లా కాకుండా ఓ యుద్ధంలా చూస్తారు.. అందుకే దాయాదుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ప్రతీ క్షణం ఉత్కంఠగా సాగుతుంది.. అలాంటి హైఓల్టేజ్ మ్యాచ్ కి ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మారింది.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా.. దీంతో.. పాకిస్థాన్ బ్యాటింగ్‌కు దిగుతోంది..