Leading News Portal in Telugu

Pakistan: పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు


Pakistan: పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు

శనివారం అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. వారికి స్వాగతం పలికేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో టీమిండియా అభిమానులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు. అందుకు సంబంధించి అభిమానులతో పాటు పలువురు నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

అహ్మదాబాద్లోని ప్రధాని మోడీ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటం కోసం ఇక్కడకు చేరుకున్నారు. పాకిస్తాన్ జట్టుకు స్వాగతం పలికేందుకు అమ్మాయిలు నృత్యం చేశారు. గుజరాతీ దుస్తులు ధరించిన అమ్మాయిలు పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ కనిపించారు. అంతేకాకుండా వారిపై పూలవర్షం కురిపించారు. పాక్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలకడం టీమిండియా అభిమానులకు నచ్చలేదు. దీంతో ఒక నెటిజన్ బీసీసీఐని ట్రోల్ చేశాడు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఇండియన్ ఆర్మీ ఫోటోను షేర్ చేస్తూ, సైనికుల బలిదానాన్ని బీసీసీఐ మరిచిపోయిందని రాశారు.

ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. తన తొలి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడగా.. రెండో మ్యాచ్ శ్రీలంకతో ఆడింది. ఇక టీమిండియా కూడా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడి 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌ ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడి 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.