Leading News Portal in Telugu

Virat Kohli: అయ్యర్‌ భయ్యా.. ఒక్క సింగిల్ తీయవా?! విరాట్ కోహ్లీ వీడియో వైరల్


Virat Kohli: అయ్యర్‌ భయ్యా.. ఒక్క సింగిల్ తీయవా?! విరాట్ కోహ్లీ వీడియో వైరల్

Is Virat Kohli asked for a single from Shreyas Iyer in IND vs AFG Match: వన్డే ప్రపంచకప్‌ 2203లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 8 వికెట్లకు 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8×4, 1×6), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (62; 69 బంతుల్లో 2×4, 4×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా (4/39) నాలుగు వికెట్స్ పడగొట్టాడు. అనంతరం భారత్ 35 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 273 రన్స్ చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (131; 84 బంతుల్లో 16×4, 5×6) సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ (55 నాటౌట్‌; 56 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీ చేశాడు.

ఛేదనలో 34 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 261-2గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (44), శ్రేయాస్ అయ్యర్‌ (24)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 12 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ హాఫ్ సెంచరీకి ఓ సిక్స్ అవసరం అయింది. అయితే అప్పటికే శ్రేయాస్ 101 మీటర్ల సిక్స్, ఓ బౌండరీ బాది మంచి ఊపుమీదున్నాడు. శ్రేయాస్ ఊపు చూస్తే.. అతడే మ్యాచ్ ఫినిష్ చేసేలా కనిపించాడు. అయితే అలా జరగలేదు. అజ్మతుల్లా వేసిన 35వ ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లీ.. మూడో బంతికి సింగిల్ తీశాడు. దాంతో కోహ్లీ హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు.

35వ ఓవర్ నాలుగో బంతికి శ్రేయాస్ అయ్యర్‌ సింగిల్ తీయగా.. ఐదవ బంతికి రెండు రన్స్ తీసిన విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక చివరి బంతికి బౌండరీ బాదిన కోహ్లీ.. టీమిండియాకు విజయాన్ని అందించాడు. అయితే నాలుగో బంతిని శ్రేయాస్ ఆడే ముందు.. సింగిల్ మాత్రమే తీయమని కోహ్లీ ఆడిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ‘Lubana Warriors’ అనే ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. ‘కోహ్లీ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. శ్రేయాస్ అయ్యర్‌ను సింగిల్ తీయమని అడిగాడు. కానీ మైలురాళ్ల కోసం విరాట్ ఆడడని అందరూ అంటున్నారు’ అని పేరొన్నాడు.

విరాట్ కోహ్లీకి సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. విరాట్ బ్యాట్ కోసం అడిగితే.. ఆ వీడియోను వక్రీకరించారు అని కామెంట్స్ పెడ్తున్నారు. ‘వ్యక్తిగత మైలురాయి కోసం కాకుండా.. జట్టు కోసం నిస్వార్థంగా కోహ్లీ ఆడతాడు’, ‘మీ రీచ్ కోసం ఇలా చేయొద్దు. ట్విట్టర్ మీకు డబ్బు పంపుతుంది లే. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన వ్యక్తి కోహ్లీ’, ‘ఎక్కువ మంది ఫాలోవర్స్‌ని పొందడం కోసం మీరు ఈ ట్వీట్ చేశారు కదా?’ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వీడియోలో కోహ్లీ బ్యాట్ కోసం అడుగుతున్నట్లు కనబడుతోంది. పక్కనే శ్రేయాస్ అయ్యర్ లెగ్ కనిపిస్తోంది.