
Virat Kohli Secretly Told Wife Anushka Sharma After India win vs Pakistan: అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటి అనుష్క శర్మ మెరిశారు. తన భర్త, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మాత్రమే కాకుండా భారత జట్టును ఎంకరేజ్ చేస్తూ సందడి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే పక్కన కూర్చున్న అనుష్క.. మెన్ ఇన్ బ్లూను మ్యాచ్ ఆసాంతం ఉత్సాహపరిచారు. అయితే విరాట్ 16 పరుగులకే ఔట్ అవ్వడంతో కాస్త నిరాశకు గురైన అనుష్క.. చివరకు భారత్ గెలవడంతో సంతోషపడ్డారు.
భారత జట్టు అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు అందరూ మైదానంలోకి వచ్చారు. ప్లేయర్స్ అందరూ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటుండగా.. విరాట్ కోహ్లీ తన సతీమణికి ఓ ప్రత్యేక సందేశం పంపాడు. ‘కారులో నువ్ హోటల్‌కి వెళ్లు.. నేను తర్వాత వస్తాను. ఇద్దరం అక్కడ కలుద్దాం’ అని అర్ధం వచ్చేలా సంజ్ఞలు చేశాడు. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నేను కారు డ్రైవ్ చేస్తాను.. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం’, ‘వేచి ఉండు.. ఇద్దరం కలిసి కారులో ఇంటికి వెళ్దాం’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. బాబర్ అజామ్ (50; 58 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేయగా.. మహమ్మద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో 7×4) రాణించాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (86; 63 బంతుల్లో 6×4, 6×6), శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్; 62 బంతుల్లో 3×4, 2×6) రాణించారు.
Virat Kohli talking with Anushka Sharma after the game.
– A beautiful moment….!!!!pic.twitter.com/PXiz33g77E
— Johns. (@CricCrazyJohns) October 14, 2023