
Rashid Khan: నిన్న జరిగిన ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో అతను భారత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు ఆఫ్ఘనిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. అంతేకాకుండా ‘ఢిల్లీ ప్రజలు మంచి హృదయం కలవారని.. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరు తమకు మద్దతు ఇచ్చినందుకు, ఆట జరిగినంత సేపు తమ జట్టును ఉత్సాహపరిచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. వారి ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మద్దతుదారులకు చాలా ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో తెలిపాడు.
Delhi sach mein dil walon ki hai 🙌
A huge thank you to all the fans at the stadium who supported us and kept us going through out the game 🙏
And to all our supporters around the 🌍 thank you for your love 💙
— Rashid Khan (@rashidkhan_19) October 16, 2023
ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఘోర పరాజయం పాలవడం గమనార్హం. తమకంటే పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 284 పరుగుల భారీ స్కోరు చేసి ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టును కేవలం 215 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఆఫ్ఘనిస్తాన్లోని ప్రతి ఆటగాడు 100 ప్రదర్శన చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆల్‌రౌండర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 28 పరుగులు చేయగా.. అటు బౌలింగ్‌లో 51 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అతనితో పాటు.. రెహ్మానుల్లా గుర్బాజ్ ఆఫ్ఘనిస్తాన్ తరపున 57 బంతుల్లో 80 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ కూడా 58 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ముజీబ్‌తో పాటు రషీద్ కూడా మూడు వికెట్లు తీశాడు.