
Australian Fan: నిన్న జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆసీస్ జట్టు తన మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగగా.. తమ జట్టు గెలుపొందడంపై తీవ్ర ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఓ ఆస్ట్రేలియా అభిమాని. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గణపతి బప్పా మోరియా అంటూ స్టాండ్ లో గట్టిగా నినాదాలు చేశాడు. అయితే ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత ప్రేక్షకులతో కలిసి ఆస్ట్రేలియా అభిమానులు స్లోగన్స్ చేయడం కనిపిస్తుంది. ఓ విదేశీయుడు ఇలా గణపతి నినాదాలు చేయడంతో స్టాండ్ మొత్తం లేచి అతనికి సపోర్ట్ చేశారు. ఇదిలా ఉంటే హిందూ దేవుళ్ల పట్ల విదేశీయులకు ఎంతో నమ్మకం. వారు తమ దేశానికి వచ్చినప్పుడల్లా హిందూ దేవాలయాలను దర్శించుకోవడం అలవాటే.
లక్నోలోని ఎకానా స్టేడియంలో నిన్న ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో శ్రీలంక జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌లు ఆడగా, అందులో 1 విజయం సాధించగా, 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
Australian fan chanting ‘Ganpati Bappa, Moriya’ at the Ekana Stadium.pic.twitter.com/vsRrfT92FF
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 17, 2023