
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 175 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఇవాళ జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌పై పంజాబ్ 275 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. పంజాబ్ తరుపున అభిషేక్ శర్మ 51 బంతుల్లో 112 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా అన్మోల్‌ప్రీత్ సింగ్ కేవలం 26 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 ఫోర్లు కొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 105 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున రికీ భుయ్ అద్భుత సెంచరీ చేశాడు. రికీ భుయ్ 52 బంతుల్లో 104 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. అయితే ఈ బ్యాటర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును దాటలేకపోయారు. దీంతో 105 పరుగుల భారీ తేడాతో ఆంధ్రప్రదేశ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ తరఫున హర్‌ప్రీత్ బ్రార్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. సిద్ధార్థ్ కౌల్ 2, అర్ష్‌దీప్ సింగ్, ప్రసాద్ దత్తా తలో వికెట్ తీశారు.