Leading News Portal in Telugu

IND vs BAN: బంగ్లాతో మ్యాచ్‌లో స్పెషల్ ప్లాన్స్ లేవు.. మాకు క్లారిటీ ఉంది..!



Ind Vs Ban

IND vs BAN: 2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు. టీమిండియా ఉన్న ఫాంలో బౌలర్లు, బ్యాట్స్ మెన్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారని చెప్పాడు.

Read Also: Kala Venkata Rao: జైలులో చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది..

మరోవైపు బంగ్లా కెప్టెన్ షకీబుల్‌ హసన్‌.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకుముందు భారత్‌పై అతనికి మంచి రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్‌ కోహ్లిపై అతడికి అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 14 వన్డేల్లో 5 సార్లు కోహ్లీని షకీబ్‌ ఔట్‌ చేశాడు. షకీబ్‌ అద్బుతమైన ఆటగాడని.. షకీబ్ విషయం గురించి ట్రైనింగ్ సెషన్స్ లో తాము చర్చించలేదని పరాస్ మాంబ్రే చెప్పాడు.

Read Also: Health Tips: ఇంట్లోనే సర్వరోగ నివారిణి.. వాటితో ఆరోగ్య సమస్యలకు చెక్..!

షకీబ్ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేయగల సత్తా ఉన్నవాడు. అతడు బంగ్లాదేశ్‌ జట్టుకు ఛాంపియన్‌ ప్లేయర్‌ అని తమకు తెలుసన్నాడు. కానీ ప్రత్యేకంగా అతడి కోసం తాము ఎటువంటి ప్రణాళికలను సిద్దం చేయలేదని తెలిపాడు. అయితే రేపు జరిగే మ్యాచ్‌లో తాము ఏమి చేయాలో తమకు క్లారిటీ ఉందని మాంబ్రే అన్నాడు.