Leading News Portal in Telugu

Virat Kohli: మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్


Virat Kohli: మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డు బ్రేక్

Virat Kohli: ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ శతకం బాది మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే కోహ్లీ క్రీజులో ఉన్నంతసే తన సెంచరీ పైనే శ్రద్ధ పెట్టాడు. ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో కోహ్లీ 85 పరుగులు చేశాడు. దీంతో సెంచరీ దగ్గరికి వచ్చి మిస్ అయిపోయింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం సెంచరీ చేసి తీరాల్సిందేనన్న కసితో తన భాగస్వామికి కూడా స్ట్రైక్ ఇవ్వకుండ తన 100 పరుగులను పూర్తి చేశాడు.

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ 49 సెంచరీలు చేశాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 285 మ్యాచుల్లోనే 48 శతకాలు బాదాడు. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఆ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లీ చూస్తున్నాడు. చూడాలి మరీ రెండు సెంచరీలు కొట్టి.. రికార్డు ఎప్పుడు బ్రేక్ చేస్తాడో.