
IND vs BAN: ప్రపంచకప్ 2023లో భాగంగా పూణేలో జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీమిండియా నాలుగోసారి విజయం సాధించింది. దీంతో ఓటమి ఎరుగని టీమ్ గా ముందుకెళ్తుంది. ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తూ.. విజయాల జోరు కొనసాగిస్తుంది. ఇవాళ్టి మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
ఆ తర్వాత 257 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(48), గిల్(53) మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కింగ్ కోహ్లీ సెంచరీ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ఇక మరో బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా 34 పరుగులతో చెలరేగాడు. దీంతో 41.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ప్రపంచకప్ లో నాలుగో విజయాన్ని అందుకుని.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.
ఇక టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ సాధించారు. అటు బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 2 వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ ఒక వికెట్ సాధించాడు.