Leading News Portal in Telugu

KL Rahul: కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్.. వీడియో ఇదిగో


KL Rahul: కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్.. వీడియో ఇదిగో

KL Rahul: పూణేలో ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి వికెట్ కీపర్ ఈ అద్భుత క్యాచ్ పట్టాడు. సిరాజ్ 24వ ఓవర్ తొలి బంతిని క్రాస్ సీమ్ నుండి లెగ్ సైడ్ వైపు వేశాడు. దానిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మెహదీ హసన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకొని తిరిగి కీపర్ వైపు వెళ్లింది. బంతి రాహుల్ రేంజ్ కు దూరంగా ఉన్నప్పటికీ.. ఎడమవైపు లాంగ్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. రాహుల్ పట్టుకున్న ఈ క్యాచ్ వీడియోను ఐసీసీ షేర్ చేసింది. “కేఎల్ రాహుల్, యూ బ్యూటీ” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసింది. అంతే కాకుండా.. వీడియో పై కూడా “మీరు ఏమి పట్టుకున్నారు!” అని క్యాప్షన్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. మూడు హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ మీదున్న రోహిత్ సేన.. నాలుగో విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈరోజు బంగ్లాదేశ్‌ను ఓడించి విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో, ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో, అహ్మదాబాద్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల ఛేజింగ్‌లో విజయం సాధించిన భారత జట్టు.. ఈరోజు బంగ్లాదేశ్‌పై కూడా ఛేజింగ్‌కు దిగనుంది.