Leading News Portal in Telugu

Team India: హార్ధిక్ లేని లోటును ఏ ప్లేయర్ తీర్చనున్నాడు.. ఫ్యాన్స్లో ఆందోళన


Team India: హార్ధిక్ లేని లోటును ఏ ప్లేయర్ తీర్చనున్నాడు.. ఫ్యాన్స్లో ఆందోళన

బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కాలుకు బంతి తగిలింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే చిన్న దెబ్బ కదా.. మళ్లీ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బ బలంగా తాకడంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో కూడా ఆడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటే ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ జట్టుకు ఆడపోవడం బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్‌ చేస్తాడు, అటు బ్యాటింగ్ లో కూడా మంచిగా రాణిస్తాడు. ఇప్పుడు పాండ్యా స్థానాన్ని టీమిండియాలో ఏ ఆటగాడు భర్తీ చేస్తాడనేది సమస్యగా మారింది. పాండ్యా న్యూజిలాండ్‌పై ఆడలేకపోతే.. శార్దూల్ ఠాకూర్ కూడా డగౌట్ లో కూర్చోవాల్సిందే. ఎందుకంటే అతను కూడా బౌలింగ్‌లో చాలా పరుగులు ఇస్తున్నాడు. వికెట్లు కూడా ఎక్కువ తీయలేదు.

Anukunnavanni Jaragavu Konni: ఇంట్రెస్టింగ్ గా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ పోస్టర్‌

ఈ పరిస్థితిలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బహుశా రెండు మార్పులు చేయవచ్చు. లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా ఆడగల హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ఇక శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమీకి అవకాశం దొరకనుంది. ఇదే జరిగితే టీమిండియాకు మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉంటారు.

Michelle Santner: టీమిండియాను ఎదుర్కొనేందుకు మా ప్లాన్‌ ఇదే..!

ఇక స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా బలంగా ఉన్నారు. హార్దిక్‌ పాండ్యా లేకపోవడంతో భారత్‌కు ఆరో బౌలింగ్‌ అవకాశం ఉండదు. అయితే, రోహిత్ శర్మ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించగా.. విరాట్ కూడా బంగ్లాదేశ్‌పై 3 బంతులు వేసి హార్దిక్ ఓవర్‌ను పూర్తి చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా కొన్ని సార్లు స్పిన్ బౌలింగ్ చేయడం కనిపించింది. అవసరమైతే కెప్టెన్ వీరిలో ఆరవ బౌలర్‌గా ఉపయోగించవచ్చు. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో, రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఉంటారని భావిస్తున్నారు.