Leading News Portal in Telugu

AUS vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ ఓపెనర్లు.. సెంచరీలతో చెలరేగిన వార్నర్, మార్ష్


AUS vs PAK: పాక్ బౌలర్లను చితక్కొట్టిన ఆసీస్ ఓపెనర్లు.. సెంచరీలతో చెలరేగిన వార్నర్, మార్ష్

AUS vs PAK: ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్.. బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు.

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీల మోత మోగించారు. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో 100 పరుగులు చేయగా.. మార్ష్ 100 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక వికెట్ కోల్పోకుండా పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం 32.2 ఓవర్లలో ఆసీస్ స్కోరు 231/0 ఉంది. ఇలాంటి ఆటను ఆడితే ఆస్ట్రేలియా స్కోరు 300 పైనే చేసే అవకాశం ఉంది.