Leading News Portal in Telugu

Harbhajan Singh: పాండ్యా స్థానంలో ఇతనైతే బెస్ట్


Harbhajan Singh: పాండ్యా స్థానంలో ఇతనైతే బెస్ట్

రేపు(ఆదివారం) ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో ఇండియా తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. రేపటి ఈ మ్యాచ్లో ఏదొక జట్టు విజయం సాధిస్తే.. అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకోసం ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ధర్మశాలలో జరుగనుంది. అందుకోసం ఇరు టీమ్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి.

మరోవైపు రేపు జరిగే మ్యాచ్లో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఆడటం లేదు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఆయన కాలి చీలమండకు గాయం అయింది. కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తదుపరి మ్యాచ్కు పాండ్యా ఆడటం లేదని బీసీసీఐ కూడా తెలిపింది. దీంతో హార్థిక్ స్థానంలో కెప్టెన్, కోచ్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే హార్థిక్ స్థానాన్ని ఎవరైతే న్యాయం చేస్తాడన్నది టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కీలక సూచనలు చేశాడు.

హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని పేర్కొ్న్నాడు. ఈ పిచ్పై శార్ధుల్ బౌలింగ్ కంటే మహమ్మద్ షమీ బౌలింగ్ బాగా వేయగలడని, స్వింగ్ అవుతుందని చెప్పాడు. అయితే రేపటి మ్యాచ్లో ఏ ఆటగాడికి చోటు దక్కుతుందో చూడాలి.