Leading News Portal in Telugu

Team India: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్..!


Team India: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్..!

Team India: 2023 వన్డే ప్రపంచ కప్‌లో రేపు (ఆదివారం) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌లు ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్. ఇప్పటికే గాయం కారణంగా రేపు జరిగే మ్యాచ్ తో పాండ్యా దూరం కాగా.. అతని స్థానంలో సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే ఆలోచన ఉండేది.

అందులో భాగంగానే ధర్మశాలలో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా ఇషాన్ కిషన్ కూడా తేనెటీగ బారిన పడినట్లు తెలుస్తోంది. త్రో డౌన్ సమయంలో సూర్యకుమార్ గాయపడ్డాడు. తర్వాత చేతికి కట్టు కట్టుకుని తిరిగొచ్చాడు. నివేదికల ప్రకారం.. ఇషాన్ కిషన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తేనెటీగ కుట్టింది. ఇలాంటి పరిస్థితిలో.. అతను పూర్తిగా ప్రాక్టీస్ చేయలేకపోయాడు. దీంతో టీమిండియాకు ఇదొక భారీ షాక్ అని చెప్పవచ్చు. చూడాలి మరీ రేపటికి పరిస్థితులు ఎలా మారుతాయో.. ఎవరెవరు మ్యాచ్ లో ఆడుతారో.