Leading News Portal in Telugu

IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏడ్చేశారు


IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏడ్చేశారు

వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్‌ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశారని సంజయ్ బంగర్ చెప్పాడు. ఓటమి తర్వాత భారత ఆటగాళ్లు కన్నీళ్లు ఆగలేదన్నారు.

ప్రపంచకప్ 2019 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. న్యూజిలాండ్ తక్కువ స్కోరు 239 పరుగులే చేసినప్పటికీ.. టీమిండియా బ్యాటింగ్‌ పేలవంగా ఉండటంతో నష్టాన్ని చవిచూశారు.

భారత్‌ బ్యాట్స్ మెన్లలో నలుగురు బ్యాట్స్‌మెన్లు 24 పరుగుల స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా చెరో 32 పరుగులు చేశారు. దీంతో భారత్ స్కోరు కొద్దిగా పెరిగింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇండియా మ్యాచ్‌ గెలవలేకపోయింది. రవీంద్ర జడేజా 59 బంతుల్లో 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో ఏ జట్టుకు విజయం దక్కుతుందో చూడాలి.