
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే చివరకు ఆడి 95 పరుగులు చేసి ఔటవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంకో 5 పరుగులు చేస్తే సెంచరీ అయ్యేది. కానీ సిక్సర్ కొట్టడానికి ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో గనుక కోహ్లీ సెంచరీ చేసినట్లైతే క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును చెరిపేసిన వాడయ్యేది. కానీ 95 పరుగుల వద్ద ఔటవ్వడంతో డిసాపాయింట్ కు గురయ్యాడు.
ఇదిలా ఉంటే.. భారత్ బ్యాటింగ్ లో అందరూ బ్యాట్స్ మెన్లు కలిసి కట్టుగా రాణించడంతో జట్టు విజయాన్ని అందుకుంది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స మెన్లు సమిష్టిగా రాణించారు. భారత్ బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ(46), గిల్ (26), విరాట్ కోహ్లీ(95), శ్రేయాస్ అయ్యర్ (33), కేఎల్ రాహుల్(27), రవీంద్ర జడేజా(39) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్ లో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీశాడు. ట్రెండ్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంథ్నర్ తలో వికెట్ తీశారు.
ఇక అంతకుముందు న్యూజిలాండ్ బ్యాటింగ్ లో డారిల్ మిచెల్ (130) పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. రచిన్ రవీంద్ర (75), గ్లేన్ ఫిలిప్స్ (23), విల్ యంగ్ (17) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 5 కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, బుమ్రా తలో వికెట్ సాధించారు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ అన్నింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ఉంది.