Leading News Portal in Telugu

IND vs NZ: హాట్ స్టార్లో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్కు అత్యధిక వ్యూయర్ షిప్


IND vs NZ: హాట్ స్టార్లో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్కు అత్యధిక వ్యూయర్ షిప్

IND vs NZ: ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ పోరులో ఏ జట్టు గెలిస్తే అన్ని మ్యాచ్ల్లో గెలిచిన టీమ్ గా నిలుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఇరుజట్లు నాలుగింటిలో నాలుగు గెలిచాయి. ఇప్పుడు జరిగే మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇండియా-న్యూజిలాండ్ జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. అందుకోసమని విజయం కోసం ఆరాటపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కివీస్ జట్టును భారత్ ఓడించిన సందర్భాలు లేవు. అందుకోసం గెలవాలనే కసితో ఉంది భారతజట్టు. మరోవైపు అటు అభిమానుల్లో కూడా ఈ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయారు. దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4.3 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.