Leading News Portal in Telugu

IND vs NZ: హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఎవరు.. ఇప్పటివరకు ఆడని ఆ ఇద్దరికి చోటు ఖాయమేనా?



India New Team

Suryakumar Yadav To Play IND vs NZ Match in Hardik Pandya’s Absence: వన్డే ప్రపంచకప్‌ 2023లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు నేడు తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్‌ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో ఈ మెగా సమరం జరుగనుంది. ఐదవ విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో అర్ధంతరంగా మైదానాన్ని వీడిన స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో భారత్ ఎవరిని ఆడిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మెగా టోర్నీలో హార్దిక్‌ పాండ్యా బంతితో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఇంకా హార్దిక్‌ అవసరం రాకున్నా.. మిడిలార్డర్లో అతను చాలా కీలకం. గాయంతో హార్దిక్‌ లేకపోవడం జట్టు సమతూకాన్ని దెబ్బ తీసేదే. హార్దిక్‌ స్థానంలో బ్యాటర్ కావాలనుకుంటే.. ఇషాన్‌ కిషన్‌ లేదా సూర్యకుమార్‌ యాదవ్ న్యూజిలాండ్‌పై ఆడనున్నారు. బౌలింగ్‌ విభాగం పటిష్టం కావాలనుకుంటే.. మొహ్మద్ షమీ లేదా ఆర్ అశ్విన్‌ జట్టులోకి వస్తారు. ఇప్పటివరకు బౌలర్‌గా పెద్దగా ఉపయోగపడని శార్దూల్‌ను తప్పించి.. మొహ్మద్ షమీని ఆడిస్తే సూర్య లేదా ఇషాన్‌ను ఎంచుకుని బ్యాటింగ్‌ను బలోపేతం చేసుకోవచ్చు. కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ మాటల్ని బట్టి చూస్తే.. సూర్య, షమీలు నేడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఇప్పటివరకు ప్రపంచకప్‌ 2023లో ఆడని విషయం తెలిసిందే.

Also Read: Telangana Elections 2023: దసరా తర్వాతే కాంగ్రెస్‌ రెండో జాబితా.. సీపీఐ, సీపీఎంలతో పొత్తుపై లైన్ క్లియర్!

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌ మ్యాచ్ నేపథ్యంలో శనివారం ప్రాక్టీస్‌ సందర్భంగా అతడు గాయపడ్డాడు. ఫుల్‌ టాస్‌ బంతి నేరుగా సూర్య కుడి మోచేతిని బలంగా తాకింది. ఆ తర్వాత అతను సాధన చేయలేదు. అయితే సూర్య గాయం చిన్నదే అని, మ్యాచ్‌కు దూరమయ్యేంత ఇబ్బంది లేదని సమాచారం. హార్దిక్‌ స్థానంలో సూర్య, శార్దూల్‌ స్థానంలో షమీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి జట్టు మేనేజ్మెంట్ ఎవరికి అవకాశం ఇస్తుందో.