Leading News Portal in Telugu

Pakistan vs Afghanistan: పాకిస్థాన్‌ను 250 పరుగులు కూడా చేయనివ్వం: అఫ్గాన్‌ కెప్టెన్


Pakistan vs Afghanistan: పాకిస్థాన్‌ను 250 పరుగులు కూడా చేయనివ్వం: అఫ్గాన్‌ కెప్టెన్

PAK vs AFG Playing 11 Out: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా మరికొద్ది సేపట్లో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బాబర్ చెప్పాడు. నవాజ్‌కి జ్వరం వచ్చిందని, అతడి స్థానంలో షాదాబ్ ఆడుతున్నాడని తెలిపాడు. అఫ్గాన్‌ ముందుగా బౌలింగ్ చేయనుంది.

టాస్ సమయంలో అఫ్గానిస్థాన్‌ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మాట్లాడుతూ తుది జట్టులో ఒక మార్పు చేశామని తెలిపాడు. ఫజల్హాక్ ఫారూఖీ స్థానంలో నూర్ అహ్మద్ ఆడుతున్నడని చెప్పాడు. తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నామని, కానీ టాస్ మన చేతిలో ఉండదన్నాడు. తాము శ్రీలంకలో పాకిస్థాన్‌తో సిరీస్ ఆడామని, జట్టులో మంచి స్పిన్నింగ్ ఎంపికలు ఉన్నాయన్నాడు. పాకిస్థాన్‌ను 250 లేదా అంతకంటే తక్కువకు పరిమితం చేయాలనుకుంటున్నామని షాహిదీ పేర్కొన్నాడు.

తుది జట్లు:
పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజామ్ (కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌ కీపర్‌), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్.