Leading News Portal in Telugu

Babar Azam: మా ఓటమికి కారణాలివే.. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం


Babar Azam: మా ఓటమికి కారణాలివే.. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం

నిన్న జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఘోర పరాజయం చవిచూసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ ఆఫ్ఘాన్ ఆలౌరౌండ్ ప్రదర్శన చూపించింది. దీంతో సూపర్ విక్టరీని అందుకుంది. ఇదిలా ఉంటే.. తమ జట్టు ఓటమిపై కెప్టెన్ బాబర్ ఆజం స్పందించారు. తాము అన్ని విభాగాల్లో విఫలమయ్యామని అందుకే ఓడిపోయామన్నాడు. ఆఫ్ఘాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినప్పటికీ.. బౌలర్లు రాణించలేకపోయారన్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు విఫలమయ్యారని వివరించాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం, ఫీల్డింగ్‌లో వైఫల్యాలు ఇవన్నీ తమ ఓటమికి దారితీశాయని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు అద్భుత ఆటతీరుని కనబరిచారంటూ ప్రశంసించాడు. టోర్నీలో కీలక సమయంలో ఓడిపోవడం బాధగా అనిపిస్తోందని చెప్పాడు. అయితే ఓటమిని గుణపాఠంగా తీసుకుంటామని బాబర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తగిన ప్రదర్శన చూపించలేకపోతుంది. ఇప్పటికి ఆడిన 5మ్యాచ్ ల్లో కేవలం రెండింట్లో మాత్రం విజయం సాధించింది. తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోవడంతో ఘోర పరాభవాలను మూటగట్టుకుంటోంది. దీంతో వారి ఓటమిపై అటు స్వదేశంతోపాటు క్రికెట్ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత పేలవంగా ప్రదర్శన చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే సెమీస్ బరిలో పాకిస్తాన్ ఉండాలంటే.. అన్ని మ్యాచ్ ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.