Leading News Portal in Telugu

Team India: వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..


Team India: వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు రెడీ అయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్‌ 29న లక్నో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌తో భారత జట్టు పోటీ పడబోతుంది. అయితే, వరుసగా ఊహించని ఓటములతో సతమతవుతున్న ఇంగ్లండ్‌ టీమ్.. టీమిండియా జరిగే మ్యాచ్‌తో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది.

అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. హార్దిక్‌ పాండ్యా కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్‌మెంట్‌ అతడికి రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్. పాండ్యా ప్లేస్ లో సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో హార్థిక్ పాండ్యా ఉన్నాడు. ఒకట్రెండు రోజుల్లో లక్నోలో టీమ్ తో అతడు కలవనున్నాడు.

కాగా, ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా ఎడమ కాలికి గాయమైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కూ అతడు దూరమయ్యాడు. అయితే, మొదట హార్దిక్ పాండ్యాకు అయిన గాయం పెద్దదేమి కాదని జట్టు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కానీ, తాజాగా వరుసగా మ్యాచ్‌లకు దూరం అవుతుండడం ఆందోళన కలుగుతుంది.