Leading News Portal in Telugu

IND vs ENG Pitch Report: 300 పరుగులు సాధిస్తే విజయమే!.. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్


IND vs ENG Pitch Report: 300 పరుగులు సాధిస్తే విజయమే!.. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్

IND vs ENG Pitch Report: ప్రపంచకప్ 2023లో భారత జట్టు అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతోంది. మొత్తం 5 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేనకు తదుపరి సవాలు ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచే. ఇంగ్లండ్ 5 మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయింది. రెండు జట్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాయి. దీని తర్వాత కూడా డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్‌ను భారత్ తేలిగ్గా తీసుకోదు. లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

ఎకానా పిచ్ ఎలా ఉంటుంది?
ఐపీఎల్ సమయంలో ఎకానా స్టేడియంలో బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. ఒక్కో పరుగు కోసం బ్యాట్స్‌మెన్ కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పిచ్ మెరుగుపడింది. అయితే ఇది ఇప్పటికీ బెంగళూరు లేదా ముంబై లాగా లేదు. బౌలర్లకు చాలా అనుకూలంగానే ఉంది. చాలా సార్లు బంతి ఆగి వస్తుంది. దీని కారణంగా బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌ను స్వేచ్ఛగా ఊపలేడు. ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. ఈ పిచ్‌ స్పిన్‌కు సహకరించడం ఖాయం.

300 పరుగులు చేస్తే విజయం ఖాయమే..
ఈ ప్రపంచకప్‌లో చాలా పరుగులు చేస్తున్నారు కానీ ఎకానా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలవాలంటే 300 పరుగులు చేస్తే చాలు అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు 300 పరుగులు సాధిస్తే విజయం ఖాయం. 5 మ్యాచ్‌ల్లోనూ ముందుగా బ్యాటింగ్ చేసి గెలిచిన టీమిండియా ఇక్కడ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవచ్చు. 20 ఏళ్ల క్రితం 2003లో ఇంగ్లండ్‌పై ప్రపంచకప్‌లో భారత్ చివరి విజయం సాధించింది.

రెండు జట్లూ ఇలా ఉన్నాయి..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ .. సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్,

ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (Wk/c), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, బ్రైడన్ కార్సే, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్.