
PAK vs SA: ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ సర్వశక్తులూ ఒడ్డింది. ఓపెనర్లు రాణించకపోయినా.. మిడిలార్డర్ రాణించడంతో 270 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం(50), సౌద్ షకీల్(52) అర్థశతకాలతో రాణించడంతో మోస్తారు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. షాదాబ్ ఖాన్ 43 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 4 వికెట్లు, మార్కో జాన్సన్ 3 వికెట్లు, గెరాల్డ్ కొయిట్జీ 2, లుంగి ఎంగిడి ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: IND vs ENG: 1975-2019 వరల్డ్ కప్.. ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ వివరాలు ఇవే!
ఈ పిచ్‌పై ఇది ఒక మోస్తరు స్కోరే అనే చెప్పాలి. దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌ను మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలింగ్ యూనిట్ నుంచి చాలా వైడ్లు, నో బాల్‌లు ఉన్నాయి. దీని వల్ల పాకిస్థాన్‌కు కొన్ని పరుగులు వచ్చాయి. ఫీల్డింగ్ కూడా మరింత మెరుగ్గా ఉండొచ్చు. దక్షిణాఫ్రికా ఒక ఎండ్ నుండి బాగా బౌలింగ్ చేసింది. కానీ మరొక ఎండ్ నుండి బౌలర్ ఎక్స్‌ట్రాలు ఇచ్చి ఒత్తిడిని వదులుకున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో విధ్వంసకర ప్లేయర్లు ఉన్నారు. వారు ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదిస్తారా.. లేక పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుందో వేచి చూడాల్సిందే.