Leading News Portal in Telugu

PAK vs SA: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం


PAK vs SA: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

PAK vs SA: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై ఒక వికెట్‌ తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసిన ఆలౌట్ అయింది. స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు విజయం కోసం చాలా కష్టపడింది. ప్రొటీస్ జట్టును మార్‌క్రమ్‌ 91 పరుగులు చేసి ఆదుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బవుమా 28, డికాక్‌ 24, డస్సెన్‌ 21, మిల్లర్‌ 29, జన్‌సెన్‌ 20 పరుగులు చేసి సౌతాఫ్రికా విజయంలో భాగమయ్యారు. ఈ ఓటమితో పాకిస్థాన్‌ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌ బౌలర్లలో అఫ్రిది, మహ్మద్‌ వాసిమ్‌, రవూఫ్‌, ఉసామా మిర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ప్రపంచకప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్‌ సర్వశక్తులూ ఒడ్డింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ జట్టులో ఓపెనర్లు రాణించకపోయినా.. మిడిలార్డర్‌ రాణించడంతో 270 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్ ఆజం(50), సౌద్‌ షకీల్‌(52) అర్థశతకాలతో రాణించడంతో మోస్తారు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. షాదాబ్‌ ఖాన్‌ 43 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 4 వికెట్లు, మార్కో జాన్సన్‌ 3 వికెట్లు, గెరాల్డ్‌ కొయిట్జీ 2, లుంగి ఎంగిడి ఒక వికెట్‌ పడగొట్టారు.