
AUS vs NZ: ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. చివర్లో జిమ్మీ నీషమ్ (58) దూకుడుగా ఆడినప్పటికీ చివరి ఓవరల్ రనౌట్ రూపంలో వెనుతిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 383/9 పరుగులు చేసింది. అటు న్యూజిలాండ్ జట్టులో రచిన్ రవీంద్ర (116) సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత డేరిల్ మిచెల్ (54), టామ్ లాథమ్ (21), విల్ యంగ్ (32) పరుగులు చేశారు. ఇక ఆసీస్ బౌలింగ్ లో ఆడం జంపా 3 వికెట్లు తీయగా.. జోష్ హేజిల్ ఉడ్, ప్యాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ సాధించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 388/10 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(81), ట్రేవిస్ హెడ్ (109) పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ (36), స్మిత్ (18), లంబుషేన్ (18), మ్యాక్స్ వెల్ (41), ఇంగ్లీస్ (38), కమ్మిన్స్ 37 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో అందరూ రాణించడంతో న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచారు.
ఇక న్యూజిలాండ్ బౌలింగ్ లో బౌల్ట్, ఫిలిప్స్ 3 వికెట్లు తీశారు. సాంథ్నర్ 2 వికెట్లు తీయగా.. హెన్రీ, నీష్ తలో వికెట్ సాధించారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియా జట్టు వరుసగా 4 మ్యాచ్ ల్లో గెలవగా.. న్యూజిలాండ్ బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.