
PAK vs BAN: ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యా్చ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్ చేసిన పాక్.. 45.1 ఓవర్లలో 204 పరుగులకే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసింది. బంగ్లా తరుఫున మహ్మదుల్లా (56) పరుగులు అత్యధికంగా చేశాడు. ఆ తర్వాత లిటన్ దాస్ 45, షకీబ్ 43, మెహిదీ హాసన్ మిరాజ్ 25 పరుగులు చేశారు.
కాగా.. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపించారు. షాహీన్ అఫ్రిది మొదటి ఓవర్లోనే వికెట్ తీసి.. బంగ్లాను ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టాడు. ఇక మరో బౌలర్ మహ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు తీశాడు. అఫ్రిది కూడ 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీయగా.. ఇఫ్తికార్ అహ్మద్, ఒసామా మీర్ తలో వికెట్ సాధించారు.