Leading News Portal in Telugu

PAK vs BAN: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్.. స్టాండ్లో పాలస్తీనా జెండాలతో అభిమానులు


PAK vs BAN:  పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్.. స్టాండ్లో పాలస్తీనా జెండాలతో అభిమానులు

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. ఇజ్రాయెల్ నుంచి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇండియా పాలస్తీనాకు మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఇండియాలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లో కూడా.. పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈరోజు బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ జరుగుతుంది.

ఆ మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. స్టాండ్ లో కొందరు ప్రేక్షకులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. పాలస్తీనా జెండాలతో స్టాండ్స్‌లో ప్రేక్షకులు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలస్తీనాకు ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది.

ఇదిలా ఉంటే.. నవంబర్ 2న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. మరోవైపు ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్‌ను 45.1 ఓవర్లలో 204 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 205 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లు ఓపెనర్లు మంచిగా రాణించారు. అబ్దుల్లా షఫీక్ 68 పరుగులు చేసి ఔట్ కాగా.. ఫకర్ జమాన్ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు.