
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలి ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. 5వ స్థానానికి ఎగబాకింది. పాక్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలువగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అయితే.. ఈ విక్టరీ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన స్పందనను తెలిపాడు. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లలో తమ జట్టు వ్యూహం గురించి చెప్పాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపించారని బాబర్ ఆజం తెలిపాడు. ఈ విజయం ఘనత తమ ఆటగాళ్లకే దక్కుతుందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ అద్భుత ప్రదర్శన చూపించాడని.. అతను 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో తమకు తెలుసన్నాడు. ఇప్పుడు తమ దృష్టి రాబోయే రెండు మ్యాచ్‌లపైనే ఉందని.. ఆ మ్యాచ్‌లు ఆడిన తర్వాత పాయింట్ల పట్టికలో తమ జట్టు ఎక్కడ ఉంటుందో చూద్దాం అని అన్నాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ 15-20 ఓవర్ల తర్వాత మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్న సమయంలో.. తమ బౌలర్లు వికెట్లు తీశారని అన్నాడు. అంతేకాకుండా.. ముఖ్యంగా తమ టీమ్‌కి స్టాండ్ లో ఉన్న అభిమానుల నుంచి చాలా సపోర్ట్ వచ్చిందని చెప్పాడు. ఇందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు.