
NZ vs SA Head To Head Records: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో రెండు బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 2,3 స్థానాల్లోఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏ జట్టు గెలిస్తే.. అది సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేస్తుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే 12 పాయింట్లతో దాదాపుగా సెమీస్ చేరుతుంది.
తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి ఆ తర్వాత వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే కివీస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కి కూడా కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. గాయంతో బాధపడుతున్న కేన్ అందుబాటులో ఉండడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో ఓడితే అఫ్గానిస్థాన్ (6), పాకిస్థాన్ (6)లో సెమీస్ ఆశలను పెంచినట్లవుతుంది. అందుకే గెలుపే లక్ష్యంగా కివీస్ బరిలోకి దిగనుంది.
ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు మెగా టోర్నీలో మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాయి. అయితే పూణె పిచ్ బ్యాటింగ్‌కు మరీ అనుకూలమైందేమీ కాదు. ఇక్కడ స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 350కి పైగా రన్స్ చేస్తేనే గెలుపై అవకాశాలు మెండుగా ఉంటాయి. పూణేలో వాతావరణం బాగానే ఉంది. వర్షం పడే అవకాశం లేదు. రెండు టీమ్స్ పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 71 వన్డేలు జరగగా.. న్యూజిలాండ్ 25, దక్షిణాఫ్రికా 41 విజయాలు సాధించాయి. 2019 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డే మ్యాచ్‌లో తలపడడం ఇదే తొలిసారి.
తుది జట్లు (అంచనా):
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగి ఎన్గిడి.
డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: క్వింటన్ డికాక్ (వైస్ కెప్టెన్)
బ్యాటర్స్: హెన్రిచ్ క్లాసెన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, ఐడెన్ మార్క్రామ్
ఆల్ రౌండర్లు: రచిన్ రవీంద్ర (కెప్టెన్), మార్కో జాన్సెన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్
బౌలర్లు: ట్రెంట్ బౌల్ట్, గెరాల్డ్ కోయెట్జీ