Leading News Portal in Telugu

Uncle Percy Death: శ్రీలంక క్రికెట్‌ టీమ్ వీరాభిమాని ‘పెర్సీ అంకుల్’ కన్నుమూత..


Uncle Percy Death: శ్రీలంక క్రికెట్‌ టీమ్ వీరాభిమాని ‘పెర్సీ అంకుల్’ కన్నుమూత..

శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) ‍కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. సోమవారం కొలంబోలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అబేశేఖరను క్రికెటర్స్ ముద్దుగా “అంకుల్ పెర్సీ” అని పిలుచుకునేవారు. ఈయన శ్రీలంక మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడ వాలిపోయేవాడు.

పెర్సీ అంకుల్ 1979 ప్రపంచ కప్ నుంచి తన జట్టును ఉత్సాహపరిస్తూ అబేశేఖర వచ్చారు. గత 40 ఏళ్లుగా శ్రీలంక క్రికెట్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్తుండేవాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయ జెండాను రెపరెపలాడించేవారు. గతేడాది వరకు జట్టుతో కలిసి ప్రయాణం చేసిన అంకుల్ పెర్సీ.. అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉండేవాడు.

ఈ క్రమంలో అతనికి వైద్య ఖర్చుల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.50 లక్షల చెక్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు అబేశేఖరకు అందించింది. అంతేకాకుండా.. ‘పెర్సీ అంకుల్’ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వీరాభిమాని. ఈ క్రమంలో ఈ ఏడాది ఆసియాకప్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అబేశేఖరను తన నివాసంలో కలిశారు. ఆ తర్వాత రోహిత్ శర్మ సోషల్ మీడియాలో వారిద్దరు కలిసి దిగిన ఫోటో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. పెర్సీ అంకుల్ మృతిపట్ల శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.