Leading News Portal in Telugu

New Zealand Semis Chances: హ్యాట్రిక్ ఓటములు.. డేంజర్ జోన్‌లో న్యూజీలాండ్! సెమీస్ ఛాన్సెస్ ఇలా


New Zealand Semis Chances: హ్యాట్రిక్ ఓటములు.. డేంజర్ జోన్‌లో న్యూజీలాండ్! సెమీస్ ఛాన్సెస్ ఇలా

How New Zealand Can Qualify ODI World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభంలో వరుస విజయాలు సాధించిన న్యూజీలాండ్.. ఆపై హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన కివీస్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై చేతులెత్తేసింది. పూణే వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను న్యూజీలాండ్ సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ చేతిలో కివీస్ ఓడడంతో ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌లను కలిసొచ్చింది. ప్రస్తుతం న్యూజీలాండ్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. 190 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో రన్‌రేట్‌ పడిపోయి నాలుగో స్థానానికి చేరింది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన ఆస్ట్రేలియా కంటే కివీస్ (ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు) వెనుకపడిపోయింది. దాంతో సెమీస్ చేరాలంటే.. చివరి రెండు మ్యాచ్‌ల్లో న్యూజీలాండ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ (నవంబర్ 4న), శ్రీలంక (నవంబర్ 9)తో కివీస్ తలపడాల్సి ఉంది.

పాకిస్థాన్‌, శ్రీలంక జట్లపై గెలిస్తే 12 పాయింట్లతో న్యూజీలాండ్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే కివీస్ ఖాతాలో 10 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ టీమ్స్ ఇతర మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ఆసీస్ ఒక్కటి గెలిచినా.. రన్ రేట్ కీలకం అవుతోంది. ప్రస్తుతానికి పాక్ నుంచి పెద్దగా ముప్పు లేదనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.