
New Zealand Pacer Matt Henry ruled out of ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్‌లోకి వెళ్లిన న్యూజీలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టుకు దూరం అయ్యాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి వైదొలిగాడు. మ్యాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో కైల్ జెమిసన్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని కివీస్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు.
శనివారం బెంగళూరులో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కైల్ జెమిసన్ నేరుగా బరిలోకి దిగనున్నాడు. మెగా టోర్నమెంట్‌లో ట్రావెలింగ్ రిజర్వ్‌గా జేమీసన్ ఉన్న విషయం తెలిసిందే. జేమీసన్ ప్రపంచకప్‌లో ఆడడం ఇదే మొదటిసారి. మెగా టోర్నీలో న్యూజీలాండ్‌ను గాయాలు వేధిస్తున్నాయి. కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, లాకీ ఫెర్గూసన్ మరియు జేమ్స్ నీషమ్ గాయపడ్డారు. దాంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆటలో కేవలం 11 మంది ఫిట్ ప్లేయర్‌లను మాత్రమే కలిగి ఉంది. దక్షిణాఫ్రికా మ్యాచులోనే మ్యాట్ హెన్రీకి గాయం అయింది. హెన్రీ ఏడు మ్యాచ్‌ల్లో 5.79 ఎకానమీ, సగటు 28.63తో 11 వికెట్లు తీశాడు.
Also Read: Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై అభిమానం.. 88 శాతం తగ్గింపుతో రూ. 7కే బిర్యాని! ఎక్కడో తెలుసా?
టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన న్యూజీలాండ్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై ఓడిపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓడిపోవడంతో కివీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో న్యూజీలాండ్ తప్పక గెలవాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ (నవంబర్ 4న), శ్రీలంక (నవంబర్ 9)తో కివీస్ తలపడాల్సి ఉంది. పాకిస్థాన్, శ్రీలంక జట్లపై గెలిస్తే 12 పాయింట్లతో కివీస్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆ టీమ్ ఆధారపడాల్సి ఉంటుంది.