Leading News Portal in Telugu

Virat Kohli: కల నెరవేరింది.. బర్త్ డే రోజున సంతోషంగా ఉంది..!


Virat Kohli: కల నెరవేరింది.. బర్త్ డే రోజున సంతోషంగా ఉంది..!

Virat Kohli: ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శతకం సాధించి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఏ క్రికెటర్ సాధించలేని ఈ అరుదైన ఘనతను కోహ్లీ సాధించి వచ్చే తరం వారికి మరో క్రికెట్ గాడ్ గా నిలిచాడు. కోహ్లీ తన 35వ పుట్టిన రోజునే ఈ రికార్డు నెలకొల్పడంపై క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు, క్రికెట్ దిగ్గజాలు కూడా అభినందిస్తున్నారు.

సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. కల నెరవేరిందన్నాడు. భారత్‌ తరఫున ఆడే ప్రతి అవకాశం తనకు చాలా పెద్దదని తెలిపాడు. తన పుట్టినరోజున ప్రేక్షకుల ముందు ఈ రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రఖ్యాత వేదిక, ఇంతమంది ప్రేక్షకులు ముందు తన పుట్టిన రోజున సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉందని. ఏ ప్లేయర్‌కు అయినా ఇదొక కల అంటూ కోహ్లి పేర్కొన్నాడు.

మరోవైపు కోహ్లీ రికార్డుపై పలువురు స్పందించారు. విరాట్ కోహ్లీ తన బర్త్​డే రోజు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్​గా సచిన్​తోపాటు నిలిచాడని ఐసీసీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక అలాగే ఆయన సతీమణి అనుష్క.. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ విరాట్ సెంచరీ ఫొటోను షేర్ చేసింది. పుట్టిన రోజు నాడు ప్రత్యేక బహుమతిని నీకు నువ్వే ఇచ్చుకున్నావు.. క్లాస్‌ ఇన్నింగ్స్‌ అని తెలిపింది.. హీరో వెంకటేశ్ కూడా తన స్పందనను తెలియజేశాడు. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఉండవని తెలిపాడు.