Leading News Portal in Telugu

Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్‌ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?


Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్‌ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?

India World Cup 2023 Semifinal Match With New Zealand: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ఇంకా నాలుగు మిగిలున్నా.. సెమీస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. నాలుగో టీమ్‌గా న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాదించనుంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన కివీస్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌‌లను వెనక్కి నెట్టి దాదాపుగా సెమీస్‌కు దూసుకెళ్లింది.

ప్రపంచకప్ 2023లో అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ సెమీస్ నుంచి నిష్క్రమించదు. 8 పాయింట్స్ ఉన్న పాకిస్థాన్. న్యూజిలాండ్‌ను దాటి సెమీస్ చేరాలంటే భారీ విజయాన్ని అందుకోవాలి. ఇంగ్లండ్‌తో శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కనివిని విజయం సాదించాలి. ఒకవేళ పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల తేడాతో గెలుపొందాలి. అంటే పాకిస్థాన్ 400 పరుగుల భారీ స్కోర్ చేసి.. ఇంగ్లండ్‌ను 130 పరుగులకు ఆలౌట్ చేయాలి. ఒకవేళ ముందుగా బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేయడమే కాకుండా.. లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో చేధించాలి.

ఎలా చూసుకున్నా పాకిస్తాన్ గెలుపొందడం అసాధ్యం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు అయినట్లేనని క్రికెట్ విశ్లేషకులు, ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమయితే కివీస్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. అప్పుడు భారత్ సెమీఫైనల్ అభ్యర్థి న్యూజిలాండ్ అవుతుంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీ కొట్టనున్నాయి.