Leading News Portal in Telugu

SA vs AFG: వరల్డ్కప్ నుంచి ఆఫ్ఘాన్ నిష్క్రమణ.. సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపు



Sa Won

SA vs AFG: ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ నిష్క్రమించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘాన్ జట్టులో అజ్మతుల్లా ఉర్జాయ్ 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక దక్షిణాఫ్రికా తరపున గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లు పడగొట్టాడు.

Read Also: Ram Reddy Damodar Reddy: బీఆర్ఎస్ ను ఓడించాలన్నదే మా లక్ష్యం

245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. క్వింటన్ డి కాక్ (41), కెప్టెన్ టెంబా బావుమా(23) తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (76), మార్క్‌రామ్(25) పరుగులు చేశారు. వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (10) పరుగులు చేసి ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్ (24), ఆండిలే ఫెహ్లుక్వాయో (39) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో వాన్ డెర్ డ్యూసెన్ క్రీజులో నిలిచి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆఫ్గానిస్థాన్‌లో బౌలింగ్ లో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ కు ఒక వికెట్ దక్కింది.

Read Also: Election Campaign: ఎన్నికల ప్రచారంలో అపశృతి.. 10 మంది మహిళలకు తీవ్ర గాయాలు