Leading News Portal in Telugu

Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..! అనుష్క శర్మ బేబీ బంప్ వీడియో వైరల్



Kohli

విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో విరాట్ కోహ్లీ త్వరలో రెండోసారి తండ్రి కాబోతున్నాడని సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది.

Read Also: Earthquake: ఢిల్లీలో 2.6 తీవ్రతతో భూకంపం..

గతకొద్దీ రోజులుగా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని దంపతులిద్దరూ చెప్పడం లేదు. నిజమా కాదా అని కూడా దానిపై క్లారిటీ ఇవ్వడంలేదు. వారిపని వారు చూసుకుంటూ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఛోటా విరాట్ రాబోతున్నడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వారిద్దరు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

Read Also: World Cup 2023: స్టార్ స్పోర్ట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల వివాహం డిసెంబర్ 2017లో జరిగింది. ఆ తరువాత వీరిద్దరూ జనవరి 2021లో మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ దంపతుల కుమార్తె వామిక 11 జనవరి 2021న జన్మించింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 8 మ్యాచ్‌ల్లో 108.60 సగటుతో 543 పరుగులు చేశాడు.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)