Leading News Portal in Telugu

Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే..!



Haris Rauf

Haris Rauf: ఒకప్పుడు పాకిస్తాన్ టీమ్ అంటే అద్భుతమైన బౌలర్లకు పేరుగాంచింది. అయితే వన్డే ప్రపంచకప్‌ 2023లో పాకిస్తాన్ జట్టు బౌలర్ల పరిస్థితి.. బ్యాట్స్‌మెన్లు, ఫీల్డర్ల కంటే అధ్వాన్నంగా ఉంది. ఈ ప్రపంచకప్‌కు రాకముందు.. పాకిస్తాన్ జట్టు ఫాస్టెస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ అతను ఆ అంచనాలను నెరవేర్చలేకపోయాడు. అంతేకాకుండా.. ఈ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ పరుగుల పరంగా ప్రపంచ రికార్డును సృష్టించాడు.

Read Also: Crime News: స్నేహితుడి భార్యపై కన్ను.. నరికి చంపిన భర్త

ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా పాకిస్తాన్‌ బౌలర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ లీగ్‌ స్టేజిలో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రవూఫ్‌ నిలిచాడు. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును సాధించాడు. వరల్డ్‌కప్‌ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్‌ అందరి బౌలర్ల కంటే ఎక్కువగా 533 పరుగులిచ్చాడు. ఇప్పటివరకు ఈ పేలవమైన రికార్డు ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌ ఖాతాలో ఉండేది. 2019 వరల్డ్‌కప్‌లో రషీద్‌ 11 మ్యాచ్‌ల్లో 526 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఈ జాబితాలో రషీద్‌, శ్రీలంక పేసర్‌ మధుషంక మూడో స్ధానంలో కొనసాగుతున్నారు.

Read Also: PM Modi: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు