Leading News Portal in Telugu

ENG vs PAK: విజయంతో ముగించిన ఇంగ్లాండ్.. పాకిస్తాన్ పై గెలుపు



Eng Won

ENG vs PAK: ఎట్టకేలకు ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది. 338 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన పాక్.. 246 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్‌ బ్యాటర్లలో అఘా సల్మాన్‌ 51 అత్యధిక పరుగులు చేశాడు. బాబర్ ఆజం 38, మహ్మద్ రిజ్వాన్ 36, సౌధ్ షకీల్ 29, షాహీన్ అఫ్రిదీ 25, హ్యారీస్ రౌఫ్ 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్‌ రషీద్‌, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.

Read Also: Uttar Pradesh: జూదగాళ్ల ఆచూకీ చెప్పాలని రైతును చితకబాదిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో అత్యధికంగా బెన్‌ స్టోక్స్‌ 84 పరుగులు చేయగా.. జోరూట్‌ 60, జానీ బెయిర్‌ స్టో 59 పరుగులతో రాణించారు. చివరలో హ్యారీ బ్రూక్‌ 30, డేవిడ్‌ విల్లీ 15 పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో హ్యారీస్‌ రవూఫ్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత షాహీన్‌ అఫ్రిది, వసీం తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో పాకిస్తాన్‌ కూడా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read Also: World Cup 2023: సెమీస్లో తలపడే జట్లు ఇవే.. ఇండియాతో ఆ జట్టు పోటీ