Leading News Portal in Telugu

Salman Khan: ఈసారి వరల్డ్ కప్ గెలిచేది వారే..


Salman Khan: ఈసారి వరల్డ్ కప్ గెలిచేది వారే..

రేపు ఆహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాలో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీగ్ దశ నుంచి ఫైనల్‌ వరకు వరుస విజయాలతో ముందుకు సాగిన రోహిత్‌ సేన.. చివరి పోరులోనూ అజేయంగా నిలవాలనే సంకల్పంతో ఉన్నారు. అయితే, ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే దానిపై పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్స్ విజేత ఎవరో అతను తేల్చి చెప్పారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. మరోసారి భారత్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తుందని సల్మాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. వరల్డ్ కప్‌లో భారత్ ఎలా ఆడుతున్నదో అందరూ చూశారు.. టీమిండియాకు ఛాంపియన్‌గా నిలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ కొనసాగుతున్న సమయంలో టైగర్ 3తో ముందుకు వచ్చాం.. ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టిందని కండలవీరుడు తెలిపారు. భారత్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ను గెలుచుకున్న తరువాత మరోసారి థియేటర్‌లకు రావాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు.