Leading News Portal in Telugu

Virat Kohli: కోహ్లీ ఔట్ తర్వాత అనుష్క ఎక్స్ప్రెషన్స్ చూడండి..



Anushka

ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు, విరాట్ సతీమణి అనుష్క శర్మ కూడా బాధపడుతున్నట్లు కనిపించింది.

Read Also: Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ స్టేజ్ పై హీరో శ్రీకాంత్ సందడి.. అమర్ ను సపోర్ట్ చేస్తూ..

అంతకుముందు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించగా.. వీఐపీ బాక్స్ లో కూర్చున్న అనుష్క లేచి నిలబడి చప్పట్లతో తన ప్రేమను చాటుకుంది. వన్డే కెరీర్‌లో కోహ్లీ మరో సెంచరీ పూర్తి చేస్తాడని అంతా భావించినా అభిమానులను నిరాశపరిచాడు. 28వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ వికెట్ భారత్‌కు ఎంత ముఖ్యమో తెలుసు. అదే సమయంలో పాట్ కమిన్స్ ఔట్ చేయడంతో.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

Read Also: Mumbai: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్..

దీంతో.. విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు. అంతకుముందు రోహిత్ శర్మ (47), శ్రేయాస్ అయ్యర్ (4), శుభ్‌మన్ గిల్(4) పెవిలియన్‌కు చేరుకున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ ఓడిపోయిన భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు వచ్చింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)