Leading News Portal in Telugu

World Cup Final 2023: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. కెప్టెన్గా అత్యధిక పరుగులు



Rohit

ప్రపంచకప్‌ ఫైనల్‌ ప్రారంభమైన వెంటనే కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Read Also: PM MODI: 140 కోట్ల మంది మీ వెంటే.. టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో 31 బంతుల్లో 47 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. కానీ అద్భుతమైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో మొత్తం 597 పరుగులు చేశాడు. ఈ రికార్డులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్‌ రికార్డులను రోహిత్ బ్రేక్ చేశాడు.

కేన్ విలియమ్సన్ 2019 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా 578 పరుగులు చేశాడు.
2007 ప్రపంచకప్‌లో మహేల జయవర్ధనే కెప్టెన్‌గా 548 పరుగులు చేశాడు.
రికీ పాంటింగ్ 2003 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా 539 పరుగులు చేశాడు.
2019 ప్రపంచకప్‌లో ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా 507 పరుగులు చేశాడు.

Read Also: Shakib Al Hasan: రాజకీయాల్లోకి షకీబ్.. బంగ్లా ఎన్నికల్లో పోటీ..

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ కష్టాల్లో పడింది. వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది. ఈ వార్త రాసే సమయానికి టీమిండియా 17 ఓవర్లలో 104 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 4 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 47 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పైనే టీమిండియా ఆశలు ఉన్నాయి.