
భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ముగిసింది. ఆ తర్వాత అభిమానులు ఎదురుచూసేది ఐపీఎల్ కోసం. 2024 ఐపీఎల్ వేలం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. అందులో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కాసుల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది. ఈసారి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడనున్నారు. అందులో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుందంటే……
Team India: ఈనెల 23 నుంచి ఆసీస్తో టీ20 సిరీస్.. విశాఖకు టీమిండియా ఆటగాళ్లు..!
పాట్ కమిన్స్
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2023లో ఆడలేదు. వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని, అందుకే ఐపిఎల్‌లో ఆడనని చెప్పాడు. దీంతో అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ వేలం 2024లో పాట్ కమిన్స్ తన పేరును ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఐపీఎల్ వేలంలో ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి వస్తే దాదాపు అన్ని జట్లూ అతన్ని తీసుకోవావాలని భావిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్‌పై కాసుల వర్షం కురవడం ఖాయం.
ట్రావిస్ హెడ్
భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీ చేసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. అందుకుగాను అతనిపై పలువురు క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే.. ఐపీఎల్ వేలం 2024లో ట్రావిస్ హెడ్‌పై డబ్బులు కుమ్మరించనున్నారు. ఇంతకుముందు.. ట్రావిస్ హెడ్ 2017లో ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఆడాడు.
మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. చివరిసారిగా ఐపీఎల్ 2015లో ఆడాడు. అయితే ఐపీఎల్ వేలం 2024లో మిచెల్ స్టార్క్ తన పేరును ఇస్తాడని అనుకుంటున్నారు. మిచెల్ స్టార్క్‌ను ఐపీఎల్ వేలంలో చేర్చినట్లయితే.. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం చాలా జట్లు భారీగా డబ్బు ఖర్చు చేస్తాయి. ఎందుకంటే.. ఈ ప్రపంచకప్‌లో మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా.. భారత్‌తో జరిగిన ఫైనల్లో మిచెల్ స్టార్క్ ముగ్గురు కీలక ఆటగాళ్లను ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.