
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను నిషేధించింది. అంతర్జాతీయ మహిళల ఆట సమగ్రతను, క్రీడాకారుల భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐసీసీ తెలిపింది. అంతర్జాతీయ ఆట కోసం కొత్త లింగ అర్హత నిబంధనలను క్రీడా వాటాదారులతో తొమ్మిది నెలల సంప్రదింపు తర్వాత ప్రక్రియను ఆమోదించింది..
FIFA 2026 World Cup Qualifiers: ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో ఖతార్‌పై భారత ఫుట్‌బాల్ జట్టు ఓటమి
కొత్త నిబంధనల ప్రకారం.. మగ నుండి ఆడగా మారిన ఏ క్రికెటర్ అయినా, ఏ శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఆడలేరు. ఈ క్రమంలో.. మొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్‌గా మారిన డేనియల్ మెక్గాహే ఇకపై మహిళల అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొనలేదు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ అమెరికాస్ రీజియన్ క్వాలిఫైయర్‌లో మెక్‌గేయ్ కెనడా తరపున ఆరు టీ20లు ఆడింది. 29 ఏళ్ల మెక్‌గేయ్ బ్రెజిల్ మహిళలపై అత్యధిక స్కోరు 48తో 19.66 సగటుతో 118 పరుగులు చేసింది.
Harish Rao : ఎన్నికలంటే మూడు రోజుల పండగ కాదు, ఐదేండ్ల భవిష్యత్తు
ఈ అంశంపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. మహిళల ఆట సమగ్రత, భద్రత, వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి లింగ మార్పిడి చేసుకున్న మహిళలు ఆడటంపై నిషేధం విధించామన్నారు. అయితే దేశీయంగా లింగ అర్హాత అనేది ఆయా దేశాలకు సంబంధించిన బోర్డు పరిధిలోనిది. అది వారిష్టం.. అని ఐసీసీ తెలిపింది.