Leading News Portal in Telugu

Legends League Cricket 2023: బ్యాట్ విరిగిపోయేలా బ్యాటింగ్ చేసిన క్రిస్ గేల్



Cries Gayel

లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ బ్యాటింగ్ లో దుమ్ములేపుతున్నాడు. 44 సంవత్సరాల వయస్సులోను క్రిస్ గేల్ బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు. ఇటీవల, లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గేల్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూనివర్స్ బాస్ గా ప్రసిద్ధి చెందిన గేల్.. భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫోర్ కొట్టాడు.. దాంతో అతని బ్యాట్ విరిగిపోతుంది. కాగా, లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 నాలుగో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్ తరఫున క్రిస్ గేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గేల్ 27 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.

Read Also: Naga Chaitanya: ఒక్క అనౌన్స్మెంట్ తో అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ తెచ్చేసాడు

ఇక, ఇదే సమయంలో క్రిస్ గేల్ స్ట్రైక్ రేట్ 192గా ఉంది.. కేవలం 23 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు, కానీ ఆ తర్వాత అతను ఔటయ్యాడు. సిద్బోథమ్ వేసిన బంతికి షాట్ కొట్టబోయి గేల్ బ్యాట్ విరిగిపోయింది.. దీంతో అతని పవర్ ఫుల్ బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ నవ్వడం ప్రారంభించారు. గేల్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే 173 పరుగుల ఛేదనలో భిల్వారా కింగ్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.