Leading News Portal in Telugu

Virat Kohli Injury: ముఖం మొత్తం కమిలింది.. విరాట్ కోహ్లీకి ఏమైంది?


Virat Kohli Injury: ముఖం మొత్తం కమిలింది.. విరాట్ కోహ్లీకి ఏమైంది?

Virat Kohli Instagram Story Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ ఉన్న ఫొటోను విరాట్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్నాడు. ఫొటోలో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకోగా.. ఎడ‌మ క‌న్ను క‌మిలిపోయి ఉంది. అంతేకాదు కుడి చెంప‌, ఎడ‌మ‌వైపు నుదురు భాగంలో చిన్న గాయం ఉంది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫొటో చూసిన అందరూ విరాట్ కోహ్లీకి ఏమైంది? అని కంగారుప‌డ్డారు. అయితే ఆ ఫొటోకు ‘మీరు మ‌రొక వ్య‌క్తిని చూస్తారు’ అని క్యాప్ష‌న్ రాశాడు. దాంతో ఆ ఫొటో మార్ఫింగ్ అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విరాట్ ఆడడం లేదు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ 2023లో కోహ్లీ 765 పరుగులు చేశాడు. అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా దక్కింది.

ఐపీఎల్ 2024 కోసం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు విరాట్ కోహ్లీని అట్టిపెట్టుకుంది. 16వ సీజ‌న్‌లో కోహ్లీ అల‌రించాడు. వ‌రుస‌గా రెండు శ‌త‌కాలు చేసిన విరాట్‌.. బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ గెలవడంతో బెంగ‌ళూరు ఇంటిదారి ప‌ట్టింది. ఇప్పటివరకు రెండుసార్లు ఫైన‌ల్ చేరిన బెంగ‌ళూరు.. ఒక్క‌సారి కూడా చాంపియ‌న్‌గా నిల‌వ‌లేక‌పోయింది. ఐపీఎల్ 2024లో కప్ కొట్టాలని కోహ్లీ భావిస్తున్నాడు.