Leading News Portal in Telugu

IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఆసీస్ జట్టులో మార్పులు


IND vs AUS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఆసీస్ జట్టులో మార్పులు

ఐదు టీ20 సిరీస్ లో భాగంగా కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య 3 టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు వరుస ఓటమిపాలైన కంగారుల జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ఇండియా వశం కావొద్దని చూస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు భారీ మార్పులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్వదేశానికి వెళ్లారు. అంతేకాకుండా.. గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్ నాలుగో టీ20కి అందుబాటులో ఉండరు. వారు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అయితే వారి స్థానంలో వేరే ఆస్ట్రేలియా ఆటగాళ్లను భర్తీ చేసింది. మరోవైపు ఈ మ్యాచ్ లో.. ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. జట్టులోకి ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, కేన్ రిచర్డ్‌సన్, బెహ్రెన్‌డార్ఫ్ వచ్చారు. టీమిండియా కూడా.. ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. ముఖేష్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ అతని స్థానంలోకి వచ్చాడు.

World Cup: ఫైనల్‌లో భారత్ ఓటమిపై సంబరాలు.. కాశ్మీరీ స్టూడెంట్స్‌పై “ఉపా” కేసు..

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (W), సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్
ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్