Leading News Portal in Telugu

IND vs SA: రెండో టీ20లో ఆ ముగ్గురు ఎందుకు ఆడలేదో ఎవరికైనా తెలుసా?



Teami India

Aakash Chopra questions India selection for T20I series: సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. రింకూ సింగ్‌, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో సవరించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌ ప్రొటీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో సెంచరీతో అలరించిన రుతురాజ్‌ గైక్వాడ్, ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ రవి బిష్ణోయ్‌, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఆడలేదు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ట్విటర్‌ వేదికగా ప్రశ్నలు సంధించాడు. ‘శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్ ఎందుకు ఆడటం లేదో ఎవరికైనా తెలుసా?. శ్రేయస్‌ అయ్యర్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో వైస్‌ కెప్టెన్. బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. నేను ఏదో మిస్‌ అయినట్లు అనిపించింది’అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Rohit Sharma: కోలుకోలేకపోయా అంటూ.. ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్!

ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2024 నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చేందుకే మార్పులు చేయాల్సి వస్తుందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. సీనియర్ల రాకతో జూనియర్లకు చోటు దక్కడం లేదని ఇంకొకరు పేర్కొన్నారు. గిల్ రావడంతో రుతురాజ్‌, జడేజా రాకతో బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితం అయ్యారు. తిలక్ వర్మకు అవకాశం ఇచ్చేందుకు అయ్యర్ ను పక్కన పెట్టారని ఫాన్స్ అంటున్నారు.