Leading News Portal in Telugu

Babar Azam: బాబర్‌ అజామ్‌ను కాదు.. పాకిస్థాన్‌లో ఎక్కువ సెర్చ్‌ చేసింది భారత ఆటగాడినే!


Babar Azam: బాబర్‌ అజామ్‌ను కాదు.. పాకిస్థాన్‌లో ఎక్కువ సెర్చ్‌ చేసింది భారత ఆటగాడినే!

Shubman Gill is the top 10 Google searches in Pakistan this year: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన (సెర్చ్‌ చేసిన) వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అయితే పాకిస్థాన్‌లో గిల్ కోసం ఎక్కువ మంది వెతికారట. పాకిస్థాన్‌లో గూగుల్‌ టాప్‌ ట్రెండింగ్‌ సెర్చ్‌ 2023లో పాక్ మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ టాప్ 10లో కూడా లేకపోవడం విశేషం.

జియో న్యూస్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన జాబితాలో శుభ్‌మన్‌ గిల్ టాప్ 10లో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఈ జాబితాలో లేడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది అత్యుత్తమ క్యాలెండర్ ఇయర్‌ను గిల్ కలిగి ఉన్నాడు. సారా టెండూల్కర్‌తో ప్రేమాయణం అనే రూమర్స్ కూడా అతడిని టాప్ 10లోకి తీసుకొచ్చాయి. ఆట, ప్రేమాయణంతో గిల్ పాపులారిటీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది.

ఇక గూగుల్‌లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీడా టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వన్డే ప్రపంచకప్, ఆసియాకప్, మహిళల ప్రీమియర్ లీగ్, ఆసియా క్రీడలు, ఇండియన్ సూపర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, యాషెస్ సిరీస్, మహిళ క్రికెట్ ప్రపంచకప్, ఎస్‌ఏ20 ఉన్నాయి.